calender_icon.png 16 December, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనవరి 21న టోఫెల్ ఐబిటి టెస్ట్

16-12-2025 09:00:24 PM

హైదరాబాద్: విద్యారంగంలో టోఫెల్ పరీక్ష(TOEFL Test)కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. విద్యార్థుల యొక్క ఇంగ్లీష్ భాషా సామర్థ్యాలను అంచనా వేసేందుకు దీనిని నిర్వహిస్తుంటారు. టోఫెల్ దరఖాస్తు ప్రక్రియ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్(ఈటీఎస్) ఆర్గనైజషన్ నిర్వహిస్తుంది. తాజాగా ఈటీఎస్ టోఫెల్ అనుభవ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. జనవరి 21న జరగబోయే టోఫెల్ ఐబిటి టెస్టుకు సంబంధించి ఒక అవగాహన కార్యక్రమంగా ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలో చేసిన మార్పుల పట్ల లోతైన అవగాహన కల్పించేందుకు టోఫెల్ నిపుణులను ప్రముఖ విద్యావేత్తలు, సలహాదారులు, భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది.

ఈ అనుభవపూర్వక ఫార్మాట్ విద్యావేత్తలు, సలహాదారులు పరీక్ష రాసే వ్యక్తుల విజయానికి మెరుగైన మద్దతు ఇవ్వడానికి వీలు కల్పించే భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి ఈటీఎస్ దీనిని నిర్వహించింది. ఈటీఎస్ కోసం దక్షిణ భారతదేశంలో కీలకమైన మార్కెట్‌గా హైదరాబాద్ నిలిచింది. విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల టోఫెల్ పరీక్ష కోసం ఆసక్తి కనబరుస్తున్న వారి సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతోందని గ్లోబల్ పార్టనర్‌షిప్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిడ్నీ రోడ్రిగ్స్ డిసౌజా చెప్పారు.

ఈటీఎస్ ఇండియా ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండు యాక్టివ్ టెస్ట్ సెంటర్‌లను నిర్వహిస్తోందని వివరించారు, ఇకపై ఎక్కువ ఖచ్చితత్వం కోసం ఏఐ -ఆధారిత స్కోరింగ్‌ను పరిచయం చేస్తున్నట్టు తెలిపారు. ఈ పరీక్ష రాసేవారు ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లోనే ఎక్కువగా వున్నారని గుర్తు చేశారు. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి హైదరాబాద్ ఒక కీలక ప్రాంతంగా నిలిచిందని ఈటీఎస్ గ్లోబల్ జనరల్ మేనేజర్ ఒమర్ చిహానే చెప్పారు. యునైటెడ్ స్టేట్స్, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలను చేరువ కావడానికి చాలా మంది విద్యార్థులు టోఫెల్ ఐబిటి స్కోర్‌లపై ఆధారపడుతున్నారనీ చెప్పుకొచ్చారు.