16-12-2025 08:50:55 PM
వేములవాడ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ రూరల్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా సామ తిరుపతిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను సర్పంచ్ లు, అభినందించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం సామ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి బాధ్యత అప్పగించిన మండలంలోని సర్పంచులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రత్యేకంగా ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తనకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల అభివృద్ధి, సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.