16-12-2025 08:43:39 PM
వేములవాడ (విజయక్రాంతి): వేములవాడ పట్టణ శాఖ నాయీ బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ అధ్యక్షులుగా జనగామ కనుకసేను నాయీ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎలగందుల దేవయ్య నాయీ, గౌరవ అధ్యక్షులుగా సాగరం దేవదాసు, ప్రధాన కార్యదర్శిగా జనగామ మల్లిఖార్జున్, కోశాధికారిగా జనగామ ఓంకార్, సహాయ కార్యదర్శిగా ఎలగందుల రమేష్ ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారులుగా జనగామ తిరుమల్, శ్రీనివాస్ నాయీలను నియమించారు. సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని సంఘ సభ్యులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.