20 March, 2026 | 4:41 AM

లైంగిక వేధింపుల కేసులో.. జానీ మాస్టర్‌కు పోలీసుల నోటీసులు

18-09-2024 12:10 PM

హైదరాబాద్ప్రముఖ కొరియాగ్రాఫర్ జానీమాస్టర్ కు లైంగిక వేధింపుల కేసులో పోలీసులు నోటీసులు జారీ చేశారు. నార్సింగి పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. పోలీసులు ఈ రోజు బాధితురాలి స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆధారాలు కోసం పోలీసులు  బాధితురాలి ఇంటికి వెళ్లారు. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మతంమార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ బెదిరించినట్లుగా కూడా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన పలు వివరాలు సేకరించిన పోలీసులు అతనికి నోటీసులు జారీ చేశారు.