19-12-2025 01:53:12 AM
జెరూసలేం మత్తయ్య పిలుపు..
ముషీరాబాద్, డిసెంబర్18 (విజయక్రాం తి): క్రైస్తవులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈనెల 20న ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రిస్మస్ డిన్నర్ ను క్రైస్తవులు బహిష్కరించాలని క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి అధ్యక్షులు జెరూసలేం మత్తయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గతంలో ప్రభుత్వం క్రైస్తవులకు ఇచ్చిన హామీ ప్రతులను ప్రదర్శించారు.
అనంతరం మత్త య్య మాట్లాడుతూ.. ఎన్నికల మానిఫెస్టో, మైనారిటీ డిక్లరేషన్, క్రిస్టియన్ డిక్లరేషన్ లలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, వేదికపైకి వచ్చిన క్రైస్తవ నాయకు లు నల్లజెండాలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరస న తెలిపాలని అన్నారు. ముస్లింలకు హజ్‌యాత్ర, క్రైస్తవులకు జెరుషలేము యాత్ర, పాస్టర్లకు రూ.10 వేల గౌరవ వేతనం, క్రైస్తవ సమాధులకు స్థలాలు కేటాయింపు లేదని, ముస్లిం మైనార్టీల తోపాటు క్రైస్తవులకు రావాల్సిన రూ.200 కోట్ల నిధులు క్రిస్టియన్ కార్పొరేషన్ కు కేటాయించడం లేదని ఆయన ఆరోపించారు.