రౌడీ షీటర్లకు సీఐ కౌన్సెలింగ్
08-06-2026 01:16 AM
మహబూబాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శభరిష్ ఆదేశాల మేరకు టౌన్ డీఎస్పీ తిరుపతి రావు సూచనల ప్రకారం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలువురు రౌడీ షీటర్లకు టౌన్ సీఐ రఘుపతి రెడ్డి ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడవద్దని, గౌరవప్రదమైన జీవితం కొనసాగించాలని సూచించారు. భవిష్యత్తులో ఏవైనా నేరాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






