దార్శనిక దేవాలయాలు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు
- విద్యకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- లక్షీపురంలోని స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన
బోనకల్/ ఖమ్మం, జూన్ 7(విజయక్రాంతి): రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు కేవలం భవనాలు కావని, అవి రేపటి తరాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దే ‘దార్శనిక దేవాలయాలు’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభివర్ణించారు. విద్యకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని ఆయన స్ప ష్టం చేశారు.
ఆదివారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్లు మండ లం లక్ష్మీపురంలోని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో ఎక్క డా నాణ్యత లోపించకుండా, నిబంధనల ప్రకారం అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని ఆయన స్పష్టం చేశారు. పనులను మరింత వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు.విద్య కోసం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి..
కేవలం వ్యయం కాదు, అది రాబోయే భవిష్యత్ తరాలను శక్తివంతంగా నిర్మించడం కోసం పెట్టే అద్భుతమైన పెట్టుబడి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లక్ష్మీపురం స్కూల్ ఆవరణ అంతా తిరుగుతూ పనుల ప్రగతిని స్వయంగా అంచనా వేసిన డిప్యూటీ సీఎం. సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్, మెకానికల్ ల్యా బ్ భవనాల నిర్మాణ నాణ్యతపై అధికారులకు కీలక సూచనలు. గడువులోగా పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని గుత్తేదారులకు డిప్యూటీ సీఎం స్పష్టంగా చెప్పారు.






