14-01-2026 01:46:16 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్(cricket tournament) జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఎల్లారెడ్డి సిఐ.రాజారెడ్డి,ఏఎంసి చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డిలు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించారు.లింగంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ నిరుడి రాజు సమక్షంలో పోటీలు రెండు రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.
క్రికెట్ టోర్నమెంటులో మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు 15,555 నగదు,రెండో స్థానంలో నిలిచిన జట్టుకు 11,111 రూపాయల నగదును అందజేయడంతో పాటు జట్టులోని సభ్యులందరికీ ఫీల్డ్ అందజేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానికలు ఎస్సై భార్గవ్ గౌడ్,డిప్యూటీ ఎమ్మార్వో రాజేశ్వర్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచంద్ర రెడ్డి,వాసురెడ్డి, నరసింహారెడ్డి,డివిటి కిష్టయ్య, సంజీవులు,సురేందర్ రెడ్డి, లక్ష్మీకాంతం,బాబురావు, మురళి గౌడ్,మధు,నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.