13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

కరీంనగర్‌లో కట్టుదిట్టమైన భద్రత

14-01-2026 01:36 PM

కరీంనగర్ బస్టాండ్, ఆర్టీసీ కార్గో పార్సెల్ కేంద్రంలో తనిఖీలు

తనిఖీల్లో పాల్గొన్న పోలీసు జాగిలం  లియో

కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి: కమీషనరేట్ ప్రజల రక్షణ, శాంతిభద్రతలు,  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కరీంనగర్ పోలీసులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశామని కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ ఆలం తెలిపారు. దీనిలో భాగంగా, నగరంలోని రద్దీ ప్రాంతాలలో పోలీసులు విస్తృతస్థాయిలో, పోలీసు జగిలాలతో తనిఖీలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాలను అరికట్టడానికి, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువుల కదలికలను గుర్తించడానికి ఈ తనిఖీలు ఉపయోగపడతాయని సీపీ తెలిపారు. ఈ భద్రతా చర్యలకు వాహనదారులు, ప్రజలు సహకరించాలని కరీంనగర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100  లేదా పోలీసు కంట్రోల్ రూమ్ మొబైల్ నంబర్ 8712670744 ‌కు తెలియజేయాలని విజ్ఞప్తి చేసారు.