calender_icon.png 14 January, 2026 | 3:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా గోదారంగనాథ స్వామి కళ్యాణోత్సవం

14-01-2026 01:47:49 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా బుధవారం గోదా దేవి రంగనాథ స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కాటూరి రామాచార్యులు ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణం జరిపారు. భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని వీక్షించి తరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. దీంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మహిళా భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.