14-10-2025 09:37:50 AM
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి చోరీకి(Tirupati Parakamani theft) సంబంధించి సీఐడీ బృందం విచారణ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు విచారణను సీఐడీ పునఃప్రారంభించింది. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యాన్నార్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిని సీఐడీ బృందం(CID investigation) పరిశీలించింది. పరకామణి చోరీ కేసు నమోదైన తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్(Tirumala One Town Police Station) లో రికార్డులను అధికారులు పరిశీలించారు.2023 మార్చిలో తిరుమల(Tirumala Tirupati Devasthanams) శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ జరిగింది.
920 డాలర్లు చోరీ చేస్తూ టీటీడీ ఉద్యోగి జీయంగార్ గుమస్తా రవికుమార్(Jayanagar Clerk Ravikumar) పట్టబడ్డాడు. చోరీ ఘటనలో టీటీడీ పూర్తిస్థాయి విచారణ నిర్వహించలేదంటూ హైకోర్టులో(AP High Court) పిల్ దాఖలైంది. లోక్ అదాలత్(Lok Adalat)లో రాజీ కుదుర్చుకుని అప్పటి పాలకవర్గం కేసు మూసివేసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. లోక్ అదాలత్ లో రాజీ తర్వాత రవికుమార్ రూ.14 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇచ్చారు. పరకామణి చోరీకి సంబంధించిన రికార్డులు మాయమైన ఘటనపై ఏపీ హైకోర్టు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇచ్చిన ఆదేశాలను సీఐడీ అమలు చేయకపోవడంపై ఫైర్ అయింది. పోలీసులు ఏం చేస్తున్నారు?.. డీజీపీ నిద్రపోతున్నారా? కోర్ట్ ఆదేశాలను అమలు చేయడం తెలీదా అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పరకామణి వ్యవహారంలో నిందితులకు సహకరిస్తున్నారా? అంటూ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.