calender_icon.png 14 October, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశీలకుల ఎదుటే మహిళ నేతల సిగపట్లు

14-10-2025 11:42:22 AM

కరీంనగర్,(విజయక్రాంతి): ఐసీసీ పరిశీలకులు శ్రీనివాస్ మనయి డీసీసీ ఆఫీసులో(DCC office) ఉండగానే మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక కోసం పరిశీలనకు రాగా వారి ఎదుటే గొడవకు దిగారు. నగర మహిళా కాంగ్రెస్ కమిటీలో మా పేరు వద్దనడానికి మీరెవరు అంటూ గడ్డం కొమరమ్మ, గంట శ్రీనివాస్ అనుచరులతో  డివిజన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయం నుండి కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమిస్తున్నామని అయినా మాకు గుర్తింపు దక్కడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గొడవ పెద్దదవుతున్న క్రమంలో పరిస్థితిని గమనించిన జిల్లా నాయకులు భూమగౌడ్ ఆకుల నర్సయ్య, మదుపు మోహన్ లు వచ్చి వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందంటూ సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.