14-10-2025 12:40:34 PM
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో(Sigachi Industries factory) పేలుళ్లపై విచారణ నిర్వహించాలని న్యాయవాది కోరారు. సిగాచీ పరిశ్రమలో పేలుళ్లపై ప్రొఫెసర్ బాబూరావు పిల్ వేశారు. జులై 31న విచారణలో ప్రమాద ఘటనపై సీజే ధర్మాసనం నివేదిక కోరింది. 46 మంది చనిపోయారని, 8 మంది జాడ లేదని న్యాయవాది వసుధ తెలిపారు. కేసు నమోదైనా ఇప్పటివరక ఎవరినీ అరెస్ట్ చేయలేదని న్యాయవాది పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై సిట్ తో విచారణ చేయించాలని న్యాయవాది వసుధ కోర్టును కోరారు. మరోసారి విచారణకు రాకపోవడంతో న్యాయవాది సీజే దృష్టికి తీసుకెళ్లలేదు. నవంబరులో విచారణ నిర్వహిస్తామని న్యాయవాదికి తెలంగాణ హైకోర్టు తెలిపింది.