14-10-2025 10:59:26 AM
హైదరాాబాద్: నగరంలో బంగారం ధరలు(Gold price hike) మరోసారి భారీగా పెరిగాయి. బంగారం రోజురోజుకు సామాన్యుడికి అందకుండా పోతుంది. నేడు బంగారం ధర రూ. లక్షా 30 వేలు దాటింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,850 చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,17,780 చేరింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 1,85,763కి పెరిగింది. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు. అటు విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,28,680కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,17,950కి పెరిగింది. విజయవాడలో కిలో వెండి ధర రూ. 2,06,000 చేరుకుంది.