calender_icon.png 14 October, 2025 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టు పార్టీకి బిగ్‌ షాక్‌.. అగ్రనేత మల్లోజుల లొంగుబాటు

14-10-2025 12:21:47 PM

గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మంగళవారం నాడు సీపీఐ (Communist Party of India) సీనియర్ నాయకుడు, పొలిట్‌బ్యూరోలో భాగమైన మల్లోజుల వేణుగోపాల్ రావు(Mallojula Venugopal Rao) అలియాస్ సోను 60 మంది మావోయిస్టు కార్యకర్తలతో(Maoist activists) కలిసి ఆయుధాలు విడిచిపెట్టి గడ్చిరోలి పోలీసులకు లొంగిపోయారు. దీంతో మావోయిస్ట్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. గత వారం, తెలంగాణకు చెందిన సోను పార్టీకి రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆయుధాలను వదులుకుని ప్రధాన స్రవంతిలో చేరడంపై మావోయిస్టులలో ఉన్న చీలికను బహిర్గతం చేస్తూ, తమను తాము రక్షించుకోవాలని, అర్థరహిత త్యాగాలు చేయవద్దని కార్యకర్తలకు ఆయన ఒక లేఖలో పిలుపునిచ్చారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఇకపై సాయుధ పోరాటాన్ని కొనసాగించలేనని వేణుగోపాల్ రావు తన సహచరులకు లేఖలో చెప్పినట్లు చెబుతున్నారు. మావోయిస్టులు అనుసరించిన మార్గం పూర్తిగా తప్పుని ఆరోపించారు. పదే పదే నాయకత్వ తప్పిదాలు మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బలు తగిలాయని కూడా ఆయన అన్నారు. మల్లోజుల పోలీసులకు లొంగిపోయారని ఛత్తీస్ గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ(Chhattisgarh Deputy Chief Minister Vijay Sharma) వెల్లడించారు. మావోయిస్టు నేతలు జనజీవన స్రవంతిలో కలవడంపై విజయ్ వర్మ( Vijay Sharma) హర్షం వ్యక్తం చేశారు. నక్సలిజం అంతం కావాలని బస్తర్ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. 1970లో మల్లోజుల అలియాస్ సోను అలియాస్ భూపతి, మావోయిస్టు అగ్రనేత కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ సోదరుడు వేణుగోపాల్ రావులు మావోయిస్టు పార్టీలో చేరారు.