14-10-2025 09:46:42 AM
న్యూఢిల్లీ: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో(Telangana Local body elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టుకు(Supreme Court) చేరింది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఇటీవల బీసీలకు 42 శాతం(BC Reservation) రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ సుప్రీంకోర్టునును ఆశ్రయించింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధిస్తున్నట్లు రాజ్యాంగంలో ఎక్కడా నిబంధనలు లేవని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అంతే కాకుండా పలు రాష్ట్రాల్లో రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌లో ప్రస్తావించింది.