అమరవీరుల త్యాగస్ఫూర్తితో..
8 గంటల పనిదినాలను కాపాడుకుందాం
కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్‌ల రద్దు కోసం పోరాడుదాం
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్
సీఐటీయూ జెండా ఆవిష్కరణ
కామారెడ్డి, మే 1 (విజయక్రాంతి): అమరుల త్యాగస్ఫూర్తితో వచ్చిన ఎనిమిది గంటల పని దినాన్ని కాపాడుకుందామని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం మే డే ఉత్సవాల సందర్భంగా సిఐటియు జెండా ఆవిష్కరించి, కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసే వరకు పోరాటం చేయాలన్నారు.
సీఐటీయు ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీఐటీయు మేడే సందర్భంగా జరిగిన జెండావిష్కరణ చేశారు. సందర్బంగా జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను 29 చట్టాలను రద్దు చేసి కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు అనుకూలముగా వారికీ లాభాలు కోసం 4 లేబర్ కోడ్స్ తెచ్చిందన్నారు.
ఈ లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మికులు సంఘాటితంగా పోరాడే హక్కు, సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, బెరసరలు చేసే హక్కు, కార్మికుల తొలగింపులు, ఉద్యోగం భద్రత ఇంకా అనేక వసతులు కార్మికులు సౌకర్యాలు కోల్పోవడం జరుగుతుందన్నారు. బీజేపీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటం చేయాలిసిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు సెక్రెటరీ ముధం అరుణ్, జిల్లా నాయకులు రాజనర్సు, మంద శ్రీనివాస్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రేణుక, సత్యం, మున్సిపల్ నాయకులు మహబూబ్, సంతోష్, దీవెన, వాటర్ వరక్స్ నాయకులు ఆయాజ్, ప్రభాకర్, నర్సింగరావు, గంగాధర్, ఖలీల్, శ్రీధర్, హమాలి సంఘం నాయకులు రమేష్, నర్సింలు, స్వామి, లింగం, రాజేష్, గంగారాం, బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు జగదీశ్వర్, సాయిబాబా, ఈశ్వర్, ఎల్‌ఐసి నాయకులు నర్సింగరావు, నర్సింలు, నయీ మ్, మెడికల్ రిప్రజెంటిటీ నాయకులు రవీంద్ర చారి, మహేందర్ రెడ్డి, సంతోష్, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
తాడ్వాయిలో..
తాడ్వాయి, మే 1 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో శుక్రవారం మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణాజివాడి, తాడువాయి, ఎర్ర పహాడ్, నందివాడ, బ్రాహ్మణపల్లి, దేమి కలాన్ గ్రామాల లో లో మేడే కార్మిక దినోత్సవ ఉత్సవాలు నిర్వహించారు. కృష్ణాజివాడిలో సిఐటియు ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా నాయకులు బందెల సాయిబాబా హాజరయ్యారు. మరో నాయకుడు రజక సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ రాజయ్య పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ షేర్ బద్దం సుమలత రామరాజు, నాయకులు తిరుపతి,వెంకటి,రాజయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
గాంధారిలో...
గాంధారి, మే 1 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో మేడే సందర్భంగా సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.. కార్మికుల హక్కులు, శ్రమజీవుల గౌరవం కోసం పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ పలు కార్యక్రమాలు చేపట్టారు.. ఈ కార్యక్రమంలో సరాప్ కిషన్ రావ్, కమ్మరి సాయిలు, మధు, నర్సింలు, భూపతి సాయిలు, భూమయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






