కోఆప్షన్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన నలుగురు కాంగ్రెస్ అభ్యర్థులు
బాన్సువాడ, మే 1 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ కో ఆప్ష న్ పదవికి దరఖాస్తు చి వరి రోజు శుక్రవారం కావడంతో కాంగ్రెస్ పా ర్టీ ఎంపిక చేసిన అభ్యర్థులుకాసుల రోహిత్, మొహమ్మద్ మజీద్, (ముజ్జు), కొర్ల ప్రతిమ నరేష్ రెడ్డి, కమర్ సుల్తానా గౌస్ లు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ అభ్యర్థులు కౌన్సిలర్ లు ఉండడంతో కో ఆప్షన్ పదవులు లాంచనంగానే కాంగ్రెస్ పార్టీకి దక్కుతున్నట్లు తెలుస్తుంది. దీంతో కాంగ్రెస్ బలం 16 కు చేరుతుంది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల రవీందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గురు వినయ్ కుమార్ స్వామి, తాడ్కోల్‌సొసైటీ మాజీఅధ్యక్షుడు పిట్ల శ్రీధర్, మాజీ కౌన్సిలర నార్ల నందకిషోర్, మున్సిపల్ కౌన్సిలర్ అబ్దుల్ కాలేకే, హకీమ్, రమేష్ కాటికే, జంగం రాజు, నాగేష్, రుక్మిణి, మాజీ వార్డు సభ్యులు సలీం, కొత్త అశోక్‌పాల్గొన్నారు.






