నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత
దోమకొండ, మే 1 (విజయక్రాంతి): ఇల్లు లేని నిరుపేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది దాంట్లో భాగంగానే ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని టీపీపీసీ జనరల్ సెక్రెటరీ ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం దోమకొండ గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారు లునాగుల దివిజ -అనిల్ బో రెడ్డి మానస -రాజిరెడ్డిల నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా కాంగ్రెస్ పట్టణ టౌన్ అధ్యక్షులు సీతారాం మధు, మండల అధ్యక్షులు అనంతరెడ్డి వారందరికీ నూతన వస్త్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వడానికి ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలను అందిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గోపాల్ రెడ్డి, ఆడం శంకర్ రెడ్డి, అబ్రబోయిన స్వామి, చాముండేశ్వరి ఆలయ చైర్మన్ సిద్ధారెడ్డి, నేతుల మల్లేష్ యాదవ్, బత్తిని సిద్ధారాములు, నేతుల సుధాకర్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






