calender_icon.png 17 July, 2025 | 10:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవార్డ్ గ్రహీతను సన్మానించిన సిఐటియు నాయకులు

17-07-2025 12:10:48 AM

మందమర్రి,(విజయక్రాంతి): అంతర్జాతీయ సేవా సంస్థ తెలుగు సంస్కృతి సాహితి సేవా ట్రస్ట్, తెలంగాణ సంస్కృతి సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల జాతీయస్థాయిలో మహానంది అవార్డు అందుకున్న జర్నలిస్టు క్రాంతి కుమార్ ను సిఐటీయు నాయకులు ఘనంగా సన్మానించారు. బుధవారం పట్టణంలోని ఆయన నివాసంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి స్థానిక నాయకులతో కలిసి జాతీయ స్థాయిలో అవార్డు పొందడం పట్ల శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించి  అభినందించారు. నల్ల నేల నుండి తన వార్త కథనాలతో జాతీయ స్థాయిలో అవార్డ్ అందుకోవడం అభినందనీయమన్నారు. 

పత్రికా రంగంలో నిబద్ధతతో పని చేస్తూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పాలకుల దృష్టికి తీసుకు రావడంలో ముందుంటారని అన్నారు.  విది నిర్వహణలో ఒత్తిడీలు ఎదుర్కొన్నప్పటికీ కార్మిక వర్గం ప్రజా సమస్యల పరిష్కారంలో ఏనాడు రాజీ పడకుండా వార్త కథనాలు అందిస్తూ పాలకులకు కనువిప్పు కలిగించాడని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో తన కళానికి మరింత పదును పెట్టి ప్రజలు కార్మికులు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి వారి సమస్యల పరిష్కారం కోసం సమగ్ర వార్త కథనాలు అందించి పాలకుల దృష్టికి తీసుకు రావాలని కోరారు. విధి నిర్వహణలో అంకితభావంతో పని చేస్తూ మరిన్ని అవార్డులు రివార్డులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.