calender_icon.png 17 July, 2025 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం

17-07-2025 12:12:09 AM

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి

తుర్కయంజాల్, జులై 16:రాష్ట్రంలోని మహిళలందరినీ ఆర్థికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇందిరమ్మ మహిళా శక్తి కింద మంజూరైన కుట్టు మిషన్లను మైనార్టీ కమిషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డితో కలిసి రంగారెడ్డి పంపిణీ చేశారు.

తొర్రూరులోని ఓ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ మై నార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తుందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రస్తుతం 200మంది మైనార్టీలకు కుట్టుమిషన్లు అందజేస్తున్నామని, త్వరలోనే మరో 500మందికి ఇస్తామన్నారు. మహిళలకు కుట్టుమిషన్లు ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వం పనికూడా కల్పిస్తుం దన్నారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టే ప్రక్రియను మహిళలకే అప్పగిస్తామన్నారు. పేదలను ఆదుకోవడమే ధ్యేయంగా స్థలాలున్నవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, స్థలాలు లేనివారికి ప్రభుత్వ భూమిని చూపి త్వరలోనే ఇళ్లు కట్టించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్రెడ్డి యాదిరెడ్డి, వంగేటి గోపాల్రెడ్డి, నక్క శివలింగం గౌడ్, భాస్కర్చారి పాల్గొన్నారు.