calender_icon.png 17 July, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుర్కయాంజాల్ ఎఫ్‌ఎస్ సీఎస్‌కు నాబార్డు ప్రశంసలు

17-07-2025 12:10:44 AM

తుర్కయంజాల్, జులై 16:తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘంపై నాబార్డు ప్రశంసలు కురిపించింది. ప్రతిభావంతమైన సంఘంగా గుర్తిస్తూ అప్రిసియేషన్ సర్టిఫికెట్ అంద జేసింది. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నాబార్డు సీజీఎం బి.ఉదయ్భాస్కర్ చేతుల మీదుగా అత్యుత్తమ పనితీరు అవార్డు అందుకున్నారు.

ఎఫ్‌ఎస్ సీఎస్ ద్వారా గోడౌన్ల నిర్వహణ, లాకర్ల సదుపాయం, రైతులకు నాణ్యమైన ఎరువుల సరఫరా, వ్యవసాయ, వ్యవసాయేతర ఆర్థిక సేవలు, సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక కార్యక్రమాల విషయంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినట్లు వెల్లడించింది.

డీసీసీబీ చైర్మన్, టీజీ కాబ్ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, సంఘ సీఈవో వై.రాందాసుకు అప్రిసియేషన్ సర్టిఫికెట్ మెమొంటో అందజేసింది. ఈ కార్యక్రమంలో టీజీ కాబ్ చైర్మన్ ఎం. రవీందర్ రావు, ఆర్సీఎస్ సురేంద్రమోహన్, నాఫ్స్ కాబ్ చైర్మన్ కె. రవీందర్ తదితరులుపాల్గొన్నారు.