calender_icon.png 3 February, 2026 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ

03-02-2026 01:18:07 AM

  1. కొట్టుకున్న కార్పొరేటర్ భర్త, బీజేపీ నాయకుడు 

నాచారంలో పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు

ఉప్పల్, ఫిబ్రవరి 2(విజయక్రాంతి): నాచా రం డివిజన్లోని రైతు బజార్‌లో ఉన్న పబ్లిక్ బోర్ విషయంలో బీఆర్‌ఎస్ బీజేపీ నాయకులు మధ్య ఘర్షణ  జరిగింది. కార్పొరేటర్ భర్త సాయి జెన్ శేఖర్, బిజెపి నాయకులు పోతగాని గోపాల్ గౌడ్ మధ్య వాగ్వాదం ముదిరి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఉధృత పరిస్థితి ఏర్పడింది. ఇరువురు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. వివరాల్లోకెళ్తే నాచారం డివిజన్లోని   రైతు బజార్లో ఉన్న పబ్లిక్ బోరు కొద్దికాలంగా  పని చేయడం లేదు.  ప్రభుత్వ బస్తీ దావఖాన కు  నీళ్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి.

స్థానికుల విజ్ఞప్తి మేరకు నాచారం కార్పొరేటర్ సొంత నిధులతో మరమ్మత్తులు చేసేందుకు ప్రత్యేక టీమ్‌ని పిలిపించి పనులను ప్రారంభించారు. అక్కడికి చేరుకున్న బిజె పి నాయకులు ఇన్ని రోజులుగా బోరు మోటర్ రిపేర్ చేయించకుండా మేము చేస్తామని చెప్పిన తర్వాత మీరు చేయడమేమిటని వాదనకు దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొ న్నది.

దీంతో మహిళను చూడకుండా శాంతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదం టూ భర్త శేఖర్ బిజెపి నాయకులు పోతగాని గోపాల్ గౌడ్‌ను ప్రశ్నించారు. దీంతో  ఒకరిపై ఒకరు  దాడి చేసుకున్నారు. శాంతి భర్త శేఖర్ కు చేయికి  గాయం కావడంతో స్థానిక నాచా రం పోలీస్ స్టేషన్‌లో గోపాల్‌పై ఫిర్యాదు చేశారు. ముందుగా శేఖర్ దాడి చేశారంటూ గోపాల్ గౌడ్ సైతం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరు వర్గాల ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు.

డివిజన్‌లో అభివృద్ధిపై ఓర్వలేక దాడులు: శాంతి

ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న డివిజన్ అభివృద్ధి కోసం పాటుపడుతూ ప్రజాభి వృద్ధి ద్యేయంగా ముందుకు వెళుతున్నందుకు ఓర్వలేక కాంగ్రెస్, బిజెపి నాయకులు దాడులు చేస్తున్నారని ఇలాంటి దాడులకు భయపడేది లేదని  కార్పొరేటర్ శాంతి అన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కరిస్తున్నామని నాపై బురదజల్లే ప్రయత్నం చేయడమే కాకుండా తన భర్తపై దాడి చేయ డం సబబు కాదని, ఎన్నికల రాగానే  ఏదో ఒక సమస్యను సృష్టించి రాజకీయం చేయడం డివిజన్ ఇతర పార్టీ నాయకులు అలవాటైపోయిం దన్నారు. డివిజన్ ప్రజలు అన్ని గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో కూడా  తగిన బుద్ధి చెప్తారని ఆమె పేర్కొన్నారు.