03-02-2026 01:16:37 AM
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శేఖర్, ఈవో లావణ్య
ఎల్బీనగర్, ఫిబ్రవరి 2: కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయానికి చెందిన భూముల్లో నిర్మించిన ఇండ్లను కోర్టు ఆదేశాలతో దేవాదాయ శాఖ అధికారులు సోమవారం స్వాధీ నం చేసుకున్నారు. కర్మన్‌ఘాట్ దేవాలయానికి సంబంధించిన దత్తత దేవాలయం బన్సు రీవాలా కృష్ణ దేవాలయానికి సైదాబాద్ గ్రామ సర్వే నంబరు 110లో 2.11 ఎకరాల భూమి ఉన్నది.
ఈ భూమిలో కొందరు అక్రమంగా ఇండ్లు నిర్మించుకున్నారు. మొత్తం 21 ఇండ్లు నిర్మించగా, వీటిలో 11 ఇండ్లను ఎండోమెంట్ కోర్టు ట్రెంమినల్ ఆర్డర్ ప్రకారం, 90 రోజుల గడువు ముగియడంతో సోమవారం పోలీసుల బందోబస్తు మధ్యన ఖాళీ చేసి స్వా ధీనం చేసుకున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు తెలిపిన వివరాలు...
కర్మన్‌ఘాట్ ఆలయం భూమిలో నిర్మించిన ఇండ్ల స్థలం ఎండోమెంట్కు సంబంధిం చినవని తెలిపారు. మొత్తం 21 ఇండ్లు నిర్మించగా, 10 మంది దేవాలయానికి అద్దె చెల్లిస్తూ నివసిస్తున్నారు. మిగతా 11 మంది ఎలాంటి చెల్లింపులు చేయకుండా తమ ఇండ్లుగా భావిస్తున్నారని చెప్పారు. 35 ఏండ్లుగా ఇండ్లలో నివసిస్తున్నారని, దీనిపై కోర్టులో కేసు వేశామ ని, అద్దె చెల్లించని వారికి 25 రోజుల క్రితం నోటీసులు ఇచ్చామని తెలిపారు.
కోర్టు ఆదేశాలతో నివాసితులను ఖాళీ చేయించిన ఇండ్లను స్వాధీనం చేసుకున్నట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శేఖర్, ఈవో లావణ్య వివ రించారు. ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పోలీసులు బందోబస్తు మధ్యన ఇండ్లను ఎండోమెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇండ్ల స్వాధీనం పూర్తి గా చట్టపరమైన విధానంలో జరుగుతున్నదని,
ఆలయ హక్కుల పరిరక్షణ కోసం కచ్చితమైన చర్య అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణ, ధర్మకర్తలు దిండు ప్రవీణ్ గౌడ్, తోకటి కిరణ్ కుమార్, సింగంశెట్టి శ్రీనివాస్, జనుంపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, నారాయణ్ దుర్గా రెడ్డి, కుకునూరి గోపాల్ రెడ్డి, పూల నాగరాజు, కె.కవిత, ఓరుగంటి నరేశ్, కొండ్ర సంతోష్ కుమార్, బండిగారి శ్రీనివాస్ గౌడ్, రాజేశ్వరి, దేవాదాయ శాఖ ఈవోలు, సహాయ కమిషనరు కార్యాలయ ఇన్ స్పెక్టర్లు సిబ్బంది ఉన్నారు.
తెల్లవారుజామున ఉద్రిక్తత పరిస్థితి
దేవాదాయ శాఖ అధికారులు ఇండ్లను ఖాళీ చేయించడాన్ని నివాసితులు అడ్డుకున్నారు. తాము అన్ని అనుమతులు తీసుకుని 35 ఏండ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని, ఉన్నపళంగా ఎలా ఖాళీ చేయిస్తారని? అధికారులను ప్రశ్నించారు. ఇంకా గడువు ఉందని, తాము కోర్టు తీర్పును అప్పిల్ చేశామని, తమకు సమయం కావాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు.
చట్టప్రకారమే స్వాధీనం: ఈవో లావణ్య
కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవస్థానానికి దత్తత దేవాలయంగా ఉన్న బాన్సురివాల క్రిష్ణ మందిరానికి సంబంధించి సర్వే నంబర్ 110లో అక్రమంగా నిర్మించిన 11 ఇండ్లపై దేవాదాయ ట్రిబ్యునల్ కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఈవో లావణ్య తెలి పారు. నివాసితులకు 3 నెలల క్రితమే నోటీసు లు ఇచ్చామని, గడువు తీరడంతో 11 ఇండ్లను దేవాదాయ శాఖ హైదరాబాద్ జిల్లా సహా య కమిషనరు టి.శేఖర్ పర్యవేక్షణలో ఖాళీ చేయించినట్లు వివరించారు.
పేదల జీవితాలను ఆగం చేయొద్దు: ఎంపీ ఈటల రాజేందర్
ఇండ్ల స్వాధీనం విషయం తెలుసుకున్న ఎంపీ ఈటల రాజేందర్ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ... కోర్టు ఆదేశాలతో పేదల జీవితాలను ఆగం చేయొద్దన్నారు. కర్మన్‌ఘాట్ హనుమా న్ దేవాలయ పరిసర భూముల్లో 35 ఏళ్ల క్రితం సర్వ్ నెంబర్ 110లో సుధాకర్ అనే వ్యక్తి వేసిన వెంచర్ లే ఔట్‌లో ఆనాడు కట్టుకున్న ఇండ్లను ఎండోమెంట్ భూముల అం టూ 20 ఇండ్లల్లో నివసిస్తున్నవారిని దౌర్జన్యం గా ఖాళీ చేయించడం సమంజసం కాదన్నారు.
ఎండోమెంట్ భూమి అయితే, ఇన్నాళ్లు అధికారులు ఏం చేశారని? ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్ ఎలా ఇచ్చారని? ట్యాక్స్ వసూళ్లు చేశారని? ప్రశ్నించారు. పేదలను రోడ్ల మీద వేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు.