13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

జగ్గారెడ్డికి క్లీన్ చీట్!

27-03-2026 12:42 AM
  1. మానవ అక్రమ రవాణా కేసులో నిర్దోషులన్న కోర్టు
  2. బీఆర్‌ఎస్ హయాంలో కేసు నమోదు

సంగారెడ్డి, మార్చి 26(విజయక్రాంతి): మానవ అక్ర మ రవాణా కేసులో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మరో నేత కుసుమ కుమార్‌లను నిర్దోషులుగా పేర్కొం టూ గురువారం ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తీర్పుని చ్చింది. ఈ మేరకు వారిపై నమోదైన కేసును కొట్టివేసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఏ-1గా ఉన్న తూర్పు జయప్రకాష్ రెడ్డి, A-3గా ఉన్న కుసుమ కుమార్‌ల కేసులో నేరాలు రుజువు కాలేదని, వారిని నిర్దోషుషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది.

వీరిద్దరి తరపున న్యాయవాది జి.సంతోష్ రెడ్డి కేసును వాదించారు. ప్రత్యేక ఉత్తర్వు ద్వారా తీర్పు వెలువడగా, ఐపీసీలోని సెక్షన్లు 419, 420, 467, 468, 471, 409, 370 కింద, అలాగే భారత పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ చట్టంలోని సెక్షన్ 24 కింద శిక్షార్హమైన నేరాలకు సంబంధించి ఏ1, ఏ3 గా ఉన్న జగ్గారెడ్డి, కుసుమకుమార్‌లను నిర్దోషులుగా తేల్చారు.