19 May, 2026 | 10:20 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో రాజకీయ పార్టీల సహకారం కీలకం

27-03-2026 12:41 AM

జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి, మార్చి 26 : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏప్రిల్ మాసంలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కోరారు. గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఎస్.ఐ.ఆర్ ప్రక్రియపై వివరించారు.

ఓటరు జాబితా సవరణలో భాగంగా అర్హత ఉన్న ప్రతి పౌరుని పేరు తప్పకుండా నమోదు కావడం, ఎలాంటి పొరపాట్లు లేకుండా జాబితా సిద్ధం కావడం ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్లతో పాటు రాజకీయ పార్టీల తరపున బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు తమ బూత్ లెవెల్ ఏజెంట్లను ఈ నెల 30లోగా నియమించి, వారి జాబితాను నియోజకవర్గ0 వారీగా సమర్పించాలని సూచించారు.

బీఎల్‌ఏల నియామకం పూర్తయిన అనంతరం బూత్ లెవెల్ ఆఫీసర్లు, బీఎల్‌ఏలకు సంయుక్త సమావేశం నిర్వహించి, ఎస్.ఐ.ఆర్ నిబంధనలు, విధానాలపై అవగాహన కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సాఫీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మాధురి, ఎన్నికల విభాగపు అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.