మండల పరిషత్ కార్యాలయంలో శుభ్రత కార్యక్రమం
06-03-2026 09:22 PM
వాంకిడి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్థానిక వాంకిడి మండల పరిషత్ కార్యాలయంలో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం ఎంపీడీవో పాటిల్ జ్యోత్స్న ఆధ్వర్యంలో కార్యాలయంలో పేరుకుపోయిన పనికిరాని పాత ఫైళ్లు, రికార్డు లను గుర్తించి శుభ్రపరచి క్రమ బద్ధీకరించారు.
ముఖ్యమైన పత్రాలను శుభ్రంగా సర్దివేసి భద్రతా చర్యలతో ఇనుప పెట్టెలలో భద్రపరిచారు. కార్యాలయంలో అవసరమైన సామగ్రిని సక్రమంగా ఏర్పాటు చేసి పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి జావీద్, ఉపాధి హామీ ఏపీఓ శ్రావణ్‌తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.




