calender_icon.png 6 August, 2025 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోసానిపల్లి పాఠశాలలో దుస్తుల పంపిణీ

24-07-2025 10:23:55 PM

చేర్యాల (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గ్రామానికి చెందిన ఔత్సాహికులు పాఠశాల విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. పాఠశాల అభివృద్ధికి దాతలు సహాయ సహకారాలు అందించాలని ప్రధానోపాధ్యాయులు కోరారు. ప్రధానోపాధ్యాయుల పిలుపుమేరకు గ్రామస్తులు స్పందించారు. తమకు తోచిన సాయాన్ని అందించారు. కొమురవెల్లి మండలంలోని పోసాని పల్లి గ్రామానికి చెందిన వంగలి నర్సింలు, రమేష్ గుప్తా పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలలోని నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని తల్లిదండ్రుల పేరును నిలబెట్టాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.