calender_icon.png 5 August, 2025 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణాలు తీస్తున్న విద్యుత్ స్తంభాలు!

24-07-2025 10:22:07 PM

కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కల్వకుర్తి పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట విద్యుత్ స్తంభాలు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. విద్యుత్ స్తంభాలకు మధ్యలోనే విద్యుత్ దీపాల కోసం ఏర్పాటుచేసిన వైర్లు తేలి ప్రమాదకరంగా మారడంతో ఆ ప్రాంతంలో గమనించక కొంతమంది ప్రయాణికులు విద్యుత్ షాక్ కు గురవుతున్నారు. గతంలో కుర్మిద్ద చౌరస్తాలో ఓ యువకుడు విద్యుత్ స్తంభం నుండి తేలిన వైర్ల కరెంట్ షాక్‌తో మరణించిన ఘటన మరవకముందే గత రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతానికి చెందిన ఓ లారీ క్లీనర్ ప్రమాదానికి గురయ్యాడు. జాతీయ రహదారిపై లారీ ఆపి, ఛాయ్ తాగేందుకు రోడ్డు దాటుతుండగా విద్యుత్ స్తంభం పక్కన తేలి ఉన్న వైర్లను తాకి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాడు. అయినా విద్యుత్ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతోపాటు కల్వకుర్తి ప్రాంతంలోని ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు.