24-07-2025 10:26:33 PM
కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి..
భూత్పూర్: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) జన్మదిన వేడుకలు మండల పరిధిలోని అన్నసాగర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి(Former MLA Alla Venkateshwar Reddy) స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజల పాలన కాదు రాక్షస పాలన కొనసాగుతుందని విమర్శించారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా పరిపాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తూ ఆయురారోగ్యాలతో కేటీఆర్ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బస్వ రాజ్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ అశోక్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నరేష్ గౌడ్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు నారాయణ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్, మురళీధర్ గౌడ్, సాయిలు, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, సత్తన్న, అశోక్ గౌడ్, సరోజ్ రెడ్డి, అజీజ్, మూసా బాలస్వామి, ఫసి, సాదిక్, రాము రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.