నాకు ఆయనే ప్రాణభిక్ష పెట్టారు: ఏపీ సీఎం చంద్రబాబు
తిరుమల: ఎన్నో ఎన్నికలు చూశాం.. ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమలలో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఏపీ చరిత్రంలో 93 శాతం స్టైకింగ్ రేట్ విజయం ఎప్పుడూ రాలేదని చెప్పారు. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో విజయం సాధించామని తెలిపారు. 2003లో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం మొదలైందన్నారు.
అలిపిరి వద్ద క్లైమోర్ మైన్స్ దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డా, క్లైమోర్ మైన్స్ దాడి జరిగినప్పుడు వెంకటేశ్వరస్వామే నన్ను కాపాడారని చంద్రబాబు స్పష్టం చేశారు. వెంకటేశ్వరస్వామి ముందు సంకల్పం చేసుకొని ముందుకు వెళ్తానని పేర్కొన్నారు. రాష్ట్రానికి, జాతికి తాను చేయాల్సింది గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారన్నారు. తిరుమలలో అన్నదానం తీసుకొచ్చింది ఎన్టీఆరే అని తెలిపారు. దేవాన్ష్ పుట్టినప్పటి నుంచి ఒక రోజు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడించారు.






