calender_icon.png 16 February, 2026 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతలో క్రీడా స్ఫూర్తి నింపుతున్న సీఎం కప్ పోటీలు

16-02-2026 06:22:01 PM

డివైఎస్ఓ అక్కపాక సురేష్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతున్నాయని పెద్దపల్లి జిల్లా డివైస్ ఓ అక్కపాక సురేష్, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల రవీందర్ లు అన్నారు. సోమవారం సుల్తానాబాద్ మండల కేంద్రంలో ని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పెద్దపల్లి జిల్లా స్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి జిల్లా డీవైఎస్‌ఓ అక్కపాక సురేష్, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్త్యాల రవీందర్, పేట రాష్ట్ర బాధ్యులు శోభారాణి, జిల్లా పేట అధ్యక్ష కార్యదర్శులు సురేందర్, దాసరి రమేష్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు విద్యార్థులు, యువతలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు నిర్వహించబడుతున్నాయని, ఈ పోటీల ద్వారా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి, రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి క్రీడాకారులను తయారు చేయడం లక్ష్యంగా సాగుతున్నాయని, చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని యువతను ప్రోత్సహించడమే సీఎం కప్ ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు.

క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, ఇలాంటి పోటీలు భవిష్యత్ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒలంపిక్ ఈసీ మెంబర్ సిలివేరి మహేందర్, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కర్ణాకర్, మండల ఎస్ జి ఎఫ్ కార్యదర్శి తాండ్ర ప్రణయ్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసాద్, శ్రీవాణి, సరోజ, స్వరూప, సంధ్య, వెంకటేష్, విష్ణు, జావిద్, మాధవి, వెంకటేష్, అజయ్, కుమార్, రాజేందర్, ఇక్బాల్, అజ్జు, గెల్లు మధుకర్,సత్యం, విద్యార్థులు పాల్గొన్నారు.