calender_icon.png 16 February, 2026 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక

16-02-2026 06:02:20 PM

నిర్మల్,(విజయక్రాంతి): సారంగాపూర్  మండల కేంద్రంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు పట్టణ ఏడిఈ శ్రీనివాసరావు తెలిపారు. నిర్వహ బుధవారం రోజున సారంగాపూర్  33/11 KV సబ్ స్టేషన్ ఆవరణలో ఉదయం 10-00 గంటల నుండి మధ్యాహ్నం 01-00 గంట వరకు ఈ కార్యక్రమము నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ సంబంధిత సమస్యలను స్వీకరించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోబడతాయి. 

నిర్మల్ రూరల్ సబ్ డివిజన్ పరిధిలోని సారంగాపూర్, లక్ష్మణచాంద, నిర్మల్ రూరల్, దిలావర్‌పూర్ మండలాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార ఫోరం (CGRF)చైర్ పర్సన్ శ్రీ ఎరుకల నారాయణ హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యుత్ ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు. కావున వినియోగదారులు తమ సమస్యలను ప్రత్యక్షంగా వివరించి పరిష్కారానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.