calender_icon.png 28 January, 2026 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలేరులో ఘనంగా సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం

28-01-2026 09:11:18 PM

ఆలేరు,(విజయక్రాంతి): ఆలేరు కొలనపాక గ్రామ శివారులో సమ్మక్క సారలమ్మ చిన్న మేడారం జాతర ఘనంగా ప్రారంభమైనది. ఈరోజు ఉదయం నుండి కొలనుపాకలోని గ్రామ దేవతలను డప్పు చప్పులతో, మేళ తాళాలతో బోయ పూజారులచే ఊరేగింపుగా ఆలయ కమిటీ సభ్యులు అమ్మవార్ల ఆశీర్వాదము తీసుకొని, జాతర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సబితా రెడ్డి, కమిటీ అధ్యక్షులు సామ నారాయణరెడ్డి మాట్లాడుతూ... సమ్మక్క సారలమ్మ చిన్న మేడారం జాతరను గత ఆరు సంవత్సరాలుగా జరుపుచున్నామని,

గత సంవత్సరం 20 నుంచి 25 వేల మంది భక్తులు వచ్చారని, ఈ సంవత్సరం 30 నుంచి 35 వేల మంది భక్తులు వస్తారని వ్యక్తం చేశారు, ఈ జాతరకు స్థానిక పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, శాసనసభ్యులు బీర్ల ఐలయ్యలు వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ముత్యాల శ్రీనివాస్, విజయకుమార్, శ్రీధర్ చారి,  శేషాద్రి నీలిమ, సాంబిరెడ్డి మల్లారెడ్డి, కొత్త రంగారెడ్డి,  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.