17-01-2026 06:11:41 PM
తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో శనివారం అధికారులు విద్యార్థులతో కలిసి సీఎం కప్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. విద్యార్థులలో యువకులలో మనోధైర్యం, ఆత్మస్థైర్యం పెంపొందించడం కోసం క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో మంచి ప్రావీణ్యం సాధించినట్లయితే రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో గుర్తింపు వస్తుందన్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రఘునందన్, ఎంపీడీవో సాజిత్ అలీ, తహసిల్దార్ శ్వేతా అధికారులు పాల్గొన్నారు.