calender_icon.png 3 December, 2025 | 2:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో సీఎం దిష్టి బొమ్మ దహనం..

03-12-2025 02:06:35 PM

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బిజేపి  పట్టణం కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. బెల్లంపల్లి కాంట అంబేద్కర్ చౌరస్తా వద్ద బిజెపి శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. సీఎంరేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు దార కళ్యాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ, జిల్లా ఉపాధ్యక్షులు కోడి రమేష్,జిల్లా కార్యదర్శి రాచర్ల సంతోష్ కుమార్ జిల్లా కౌన్సిల్ సభ్యులు శనిగారపు శ్రావణ్ సీనియర్ నాయకులు దూది ప్రకాష్ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి కోడి సురేష్, కళ్ళేపల్లి నవీన్ ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎరుకల నర్సింగ్ మహిళా మోర్చా జిల్లా నాయకులు నల్లుల సంగీత పట్టణ ఉపాధ్యక్షులు సల్లం సుమలత ఎర్రోజు శ్రీనివాస్ చింతకింది లావణ్య రాజేశ్వరి కోదాటి కళావతి సోషల్ మీడియా కన్వీనర్ తోటపల్లి ఓం సాయి హరీష్ అల్లకాటి మహేష్ షేక్ గౌస్ బాబా పాల్గొన్నారు.