calender_icon.png 8 May, 2025 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

08-05-2025 12:00:00 AM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రీ

కుమ్రం భీం ఆసిఫాబాద్ ,మే7(విజయ క్రాంతి): రైతు సంక్షేమం కోసం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో ఏర్పాటు చేసిన కొను గోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు త్వరగా తరలించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రీ అన్నారు.

బుధవారం పెంచికల్ పేట మండల కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు అమ్మకానికి ధాన్యం తీసుకువచ్చినప్పుడు క్రమ పద్ధతిలో టోకెన్లు జారీ చేయాలన్నారు. 

మిల్లర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్య లు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పౌరసరవరాల శాఖ అధికారులు వినోద్ స్వామి, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రామకృష్ణ, తహసిల్దార్ వెంకటేశ్వర్, ఐకేపీ సిబ్బంది, గ్రామ సమాఖ్య సభ్యులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టాలి

తాగునీటి సమస్య లేకుండా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం కాగజ్ నగర్ మండల పరిషత్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని 28 గ్రామాలలో తాగునీటి సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హు ల పేర్లు మాత్రమే జాబితాలో ఉండాలని, అనర్హుల పేర్లు ఉన్నట్లయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.