1 August, 2026 | 1:05 AM

చంద్రబాబు చేతిలో సీఎం కీలుబొమ్మ

03-09-2025 12:32 AM

-సీబీఐ అంటే ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ ఇన్వెస్టిగేషన్ సంస్థ

-మాజీమంత్రి రామన్న ఆరోపణ

-కాళేశ్వరంపై ప్రభుత్వ తీరు నిరసిస్తూ  జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణుల ఆందోళనలు

ఆదిలాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాం తి): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష కొనసాగిస్తోందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. తెలంగాణ అస్తత్వంపై అటు మోడీ, ఇటు  సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుతో చేతులు కలిపి ఆదర్శ కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్ముతున్నారు మండిపడ్డారు.

కేంద్ర ప్రభు త్వ సంస్థలను సైతం బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ సొంతానికి వాడుకుంటు న్నారని, సీబీఐ సంస్థ అంటే ప్రస్తుతం కాంగ్రె స్, బీజేపీ ఇన్వెస్టిగేషన్ సంస్థ ఎద్దేవా చేశారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరంపై కాం గ్రెస్ కుట్రలను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే స్థానిక పార్టీ జిల్లా కార్యాలయం నుండి పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు.

అనంతరం కొమురం భీం చౌక్ వద్ద రాస్తారోకో చేపట్టారు. దింతో రాకపోకలకు అంతరాయం కలగడంతో పోలీసులు మాజీ మంత్రితో పాటు బీఆర్‌ఎస్ శ్రేణులను అరెస్టు చేశారు. అంతకుముందు పార్టీ కార్యాలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల నడుమ ఉద్రిక్తత నెలకొంది.   ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ... మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోస్తు తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే గొప్ప సంకల్పం తో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు.

మేడిగడ్డ వద్ద రెండు పిల్ల ర్లు కుంగిపోవడాన్ని సాకుగా తీసుకుని లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే బహులార్ధక సాధక ప్రాజెక్టును అబాసుపాలు చేస్తున్నారని మండిపడ్డారు. జస్టిస్ ఘోష్ తన నివేధికలో అవాస్తవాలను వండి వార్చారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజె క్టు ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు అవకాశమున్నా కేసీయార్ పేరు ప్రతి ష్టలు దక్కుతాయనే అక్కసుతో భూములను భీళ్లుగా మారుస్తున్నారని ఆక్షేపించారు.

చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరోసారి చంద్రబాబు నాయుడు మాటలు వింటూ తెలంగాణకు అన్యాయం చేసే పన్నాగం జరుగుతుంది అన్నారు. తెలంగాణ విద్యావంతులు మేధావులు మరోసారి తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై  ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ఇజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, దాసరి రమేష్, అలాల్ అజయ్, సాజిదోద్దీన్, రాజన్న, కస్తాల ప్రేమల, దమ్మపాల్, పవన్ నాయక్, సలీం పాషా తదితరులు పాల్గొన్నారు

కాళేశ్వరంపై కుట్రలను మానాలి

నిర్మల్, సెప్టెంబర్ 2(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి ఎకరానికి నీళ్లు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే దాన్ని రాజకీయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని బీఆర్‌ఎస్ జిల్లా కో ఆర్డినేటర్ కె రామ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ వైఖరి నిరసిస్తూ నిర్మల్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయం ముందు రాస్తారోకో నిర్వహించారు.

కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పదేపదే చెప్పడం వారి పరిపాలన అసమర్థతను తెలుపుతుందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ పై ప్రజలకు ఆదరణ పెరగడంతో కాలేశ్వరం పేరుతో డ్రామా కొనసాగిస్తున్నారని దీని ప్రజలు క్షమించరన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు మార్గొండ రాము పార్టీ నాయకులు భూషణ్ రెడ్డి డాక్టర్ సుభాష్ రావు నజీర్ అహ్మద్ అక్రమ్ అలీ జీవన్రావు తదితరులు పాల్గొన్నారు.