రూ.20లక్షల పరిహారం అందించాలి
-అన్నదాతలకు ఎరువులు అందజేయాలి
-అభివృద్ది పనులు పూర్తి చేయాలి
-మాజీ ఎంపీ బాల్క సుమన్
చెన్నూర్, సెప్టెంబర్ 2: నియోజక వర్గం లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, పట్టించుకునేవారే కరువయ్యారని మాజీ ఎంపీ, చెన్నూర్ మాజీ ఎంఎల్‌ఏ బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్ నియోజక వర్గంలోని సమస్యలను పరిష్కరించాలని డిమాం డ్ చేస్తూ మంగళ వారం పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్ర హం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత తీర్చాలని, గోదావ రి, ప్రాణహిత నదీ పరివాహాక ప్రాంతాలైన కోటపల్లి మండలంలోని వెంచపల్లి, సూపా క, ఆలుగామ, జనగామ, రొయ్యలపల్లి, సిర్సా, అన్నారం, దేవులవాడ, బబ్బరచెల్క, పుల్లగామ గ్రామాలు, చెన్నూర్ మండలంలోని అక్కెపల్లి, చెన్నూర్, సుందరశాల, బీరెల్లి, పొక్కూరు, నాగాపూర్, జైపూర్ మం డలంలోని వేలాల, పౌనూరు, కిష్టాపూర్ తదితర గ్రామాల్లో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 20 లక్షల రూపాయలు అందజేయాలన్నారు.
చెన్నూర్ రెవెన్యూ డివిజన్, బస్సు డిపో, మహిళా భవనాలు, గ్రంథాలయాలు, వందపడకల ఆసుపత్రి పనులు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఆస్నాద్, పారుపల్లిలను మండలాలకు ఏర్పాటు చేయాలని, తదితర ఆపిన అభివృద్ది పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమ యంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, రైతు, యూత్ డిక్లరేషన్‌లను అమలు చేయాలన్నారు.
అప్పుడే మంచిగుండే...
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ది పనులపై ‘అప్పుడే మంచిగా ఉండే..’ అనే కార్యక్రమన్ని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పట్టణంలోని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా నేరు గా ప్రజల నుంచి ఫిర్యాదులను సేకరిస్తున్నామన్నారు.
గడిచిన 20 నెలల కాలంలో ఇచ్చి న 420 హామీలు, చేసిన అభివృద్ది వివరా లు తెలుసుకొని అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మేరకు పరిష్కరించిందో తెలియజెప్పే గొప్ప కార్యక్రమం ఇది అని, పైలట్ ప్రాజెక్టుగా చెన్నూర్‌లో ప్రారంభించామని, ఈ నెల 10వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్, పట్టణ నాయకులు పాల్గొన్నారు.






