03-11-2025 01:22:51 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని ఆలయ ప్రాంగణంలో సీఎం సహాయనిధి చెక్కులను బిజెపి నాయకులు పంపిణీ చేశారు సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఆదేశాల మేరకు సీఎం సహాయనిధి చెక్కులను 8 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జాడి దిగంబర్, మేస్త్రం రాజారాం, మోహన్, సంజీవ్, పొన్న ప్రవీణ్, బెనికి శ్యాంసుందర్, సామల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.