calender_icon.png 3 November, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

కిక్కిరిసిన బుగ్గ దేవాలయం..!

03-11-2025 01:06:39 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం రెండవ కార్తీక సోమవారం అశేష భక్తజనులతో కిక్కిరిసింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి పెద్ద ఎత్తున భక్తులు శివాలయానికి చేరుకొని రాజరాజేశ్వరునికి భక్తితో మొక్కులు చెల్లించారు. ఉదయం 7 గంటల నుండి శివాలయానికి పోటెత్తారు. రెండవ కార్తీక సోమవారం సందర్భంగా ఆలయంలో శ్రీ వాసవి, హనుమాన్ భజన బృందం సభ్యులు భజన పాటలతో ఆధ్యాత్మికతను పెంపొందించారు. మహిళలు కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి భారీగా కార్తీకదీపాలను వెలిగించారు. గర్భగుడిలో అర్చకులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చరణల మధ్య భక్తులు శివలింగానికి జల, క్షీరాభిషేకాలు చేశారు.