5 August, 2026 | 2:44 AM

నిరుపేదలకు ఆర్థిక భరోసా సీఎం రిలీఫ్ ఫండ్

05-08-2026 01:34 AM

నవాబుపేట, ఆగస్టు 4 (విజయక్రాంతి): ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. నవాబుపేట మండల కేంద్రానికి చెందిన కారుకొండ మహేష్ యాదవ్, చాకలి వెంకటేష్లకు సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను నాయకులు మంగళవారం అందజేశారు. సీఎం కార్యాలయం నుండి చెక్కులు వచ్చిన వెంటనే లబ్ధిదారులను పిలిపించి, నవాబుపేట హనుమాన్ చౌక్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో చెక్కులనుపంపిణీ చేశారు.