సీఎం సహాయనిధి పేదలకు వరం
మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్
బడంగ్ పేట్ (విజయక్రాంతి) మే 12: నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరమని, అనారోగ్యం, ఆపద సమయాల్లో ఈ నిధి కొండంత అండగా నిలుస్తోందని మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్ అన్నారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ సర్కిల్ 57 పరిధిలోని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులు బొండాల వంశీధర్ రెడ్డి అల్మాస్గూడ రూ.30,000, మలిగారి యాదిరెడ్డి రూ.25,000 అందజేశారు.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్యంపై భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. ఈ సాయం పొందిన లబ్ధిదారులు త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తమకు ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెక్కులను అందజేసిన లక్ష్మారెడ్డికి లబ్ధిదారులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు బోయపల్లి గోవర్దన్ రెడ్డి, సీనియర్ నాయకులు నవారు మల్లారెడ్డి పాల్గొన్నారు.






