calender_icon.png 14 May, 2025 | 2:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన సీఎం రేవంత్ జపాన్ పర్యటన

24-04-2025 02:14:35 AM

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజయవంతగా జపాన్ పర్యటన ముగించుకున్నారు. ఏడురోజుల పర్యటనలో సీఎం రాష్ట్రానికి రూ.12 వేల కోట్ల విలువైన పెట్టుబడులు తీసుకొచ్చారు. సీఎం బుధవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా.. ఆయనకు ఎంపీలు మల్లు రవి, అనిల్‌కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, వీర్లపల్లి శంకర్, రామ్మోహన్‌రెడ్డి తదితరులు  ఘనస్వాగతం పలికారు. కాగా, సీఎం గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భారత్ సమ్మిట్ ఏర్పాట్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.