సీఎం రేవంత్ భాష మార్చుకోవాలి
- ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలను వాపస్ తీసుకోవాలి
- బేషరతుగా ఆర్‌ఎస్పీకి క్షమాపణ చెప్పాలి
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అసోసియేషన్ జాక్ రాష్ట్ర కన్వీనర్లు రుద్రవరం సునీల్, అబ్రహార్ హుస్సేన్ ఆజాద్
ముషీరాబాద్, జూన్ 18 (విజయక్రాం తి): నిన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై సీఎం రేవం త్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడిన మాటలను తక్షణమే ఉపసంహరించుకొని, బేషర తుగా క్షమాపణ చెప్పాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అసోసియేషన్ జాక్, రాష్ట్ర కన్వీనర్లు రుద్రవరం సునీల్, అబ్రహార్ హుస్సేన్ ఆజాద్ లు డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీఎం ఇంటిని ముట్టడించడానికి కూడా వెనకాడబోమని వారు హెచ్చరించారు.
ఈ మేరకు గురువారం హైదర్ గూడ లోని ఎన్‌ఎస్‌ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని సంక్షేమ శాఖల గురుకులా లలో దాదాపుగా 2 వేల కోట్ల టెండర్లలో నిధులు గోల్ మాల్ జరుగుతున్నాయని ప్రవీణ్ కుమార్ మాట్లాడిన దాంట్లో ఎలాం టి అనుమానం లేదన్నారు. తెలంగాణకి చెందిన కాంట్రాక్టర్లను కాదని, పక్క రాష్ట్రంలోని కాంట్రాక్టర్లకు గురుకుల పాఠశాల టెండర్లను అప్పజెప్పడాన్ని బీసీ, ఎస్సీ ,ఎస్టీ మైనారిటీ జాక్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
గురుకుల టెండర్ లో పాల్గొనాలంటే దాదాపుగా 200 కోట్లు నుండి 250 కోట్ల వరకు టర్నోవర్ చూపించాలని నిబంధన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని పేద వర్గాలకు చెందిన చిన్న కాంట్రాక్టర్ల దగ్గర 250 కోట్ల టర్నోవర్ చూపించే స్థాయి ఉన్నదా? అని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో దాదాపుగా 130 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే ఏ ఒక్కరిని కూడా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గా పరామర్శించలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, రాజు, దాసు, అమీర్ రాజ్, భూపాల్, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.






