19 June, 2026 | 1:33 AM

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే బస్సు యాత్రను స్వాగతిస్తున్నాం

19-06-2026 12:00 AM

తెలంగాణ ప్రదేశ్ ఏకలవ్య 

ఎరుకల కాంగ్రెస్ సంఘం వైస్ చైర్మన్ కూరాకుల మల్లికార్జున్

ముషీరాబాద్, జూన్ 18 (విజయక్రాం తి): ఎస్టీ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించి 50 ఏళ్లు అయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే బస్సు యాత్రను స్వాగతిస్తున్నామని, కానీ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వ్యక్తి ఇచ్చే బస్సును వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ప్రదేశ్ ఏకలవ్య ఎరుకల కాంగ్రెస్ సంఘం స్పష్టం చేసింది.

ఆదివాసి ఎరుకల వైస్ చైర్మన్ కూ రాకుల మల్లికార్జున్ నేతృత్వంలో సంఘం ప్రతినిధులు కూరాకుల కృష్ణ, బుడ్డా సత్యనారాయణ, డా. పానుపాటి వినోద్ కుమా ర్, రాయపూర్ సాంబయ్య, వైస్ చైర్మన్ చర్ల రమేష్, కావటి మోహన్, నల్లగొండ సమ్మయ్య, పులి చేరి రాధాకృష్ణ, పాలకొండ మల్లేశ్వరి, దేవర సుధాకర్, తదితరులు గురువారం ఆదివాసి కాంగ్రెస్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ను గాంధీ భవన్ లో కలిసి వినతిపత్రం అందజేశారు.

అనంతరం వారు బషీర్ బాగ్ లో మీడియాతో మాట్లాడుతూ అనేక ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన సీనియర్ నాయకులను విస్మరించి, 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి, పార్టీలో సభ్యత్వం కూడా లేని వ్యక్తికి ప్రాధాన్యత కల్పించడం సిగ్గుచేటన్నారు.

గతంలో కూడా బస్సు యాత్ర కోసం బస్సును గాంధీభవన్ లో పెడితే పార్టీ పెద్దలతో చర్చించి అక్కడి నుండి బస్సును తీసివేయడం జరిగిందన్నారు. ఏకలవ్య కార్పొరేషన్ చైర్మన్ పదవి తనకే వస్తుందని చెప్పుకుంటూ  బస్సుయాత్రకు బస్సు ఇస్తున్నానని చెప్పుకోవడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. అవసరమైతే ఎస్టీ సామాజిక వర్గం నుండి చందాలు వేసుకొని బస్సు యాత్రకు బస్సును అందజే స్తామని వారు పేర్కొన్నారు.