08-12-2025 01:14:55 PM
హైదరాబాద్: తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. సదస్సు ప్రాంగణంలో తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. సీఎం వెంట గ్లోబల్ సమ్మిట్ కు డిప్యూటీ సీఎం, మంత్రులు వెళ్లారు. గ్లోబల్ సమ్మిట్(Global Summit)కు సినీనటుడు నాగార్జున హాజరయ్యారు. గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit)కు దేశ, విదేశాలకు చెందిన దిగ్గజాలు తరలివస్తున్నారు. సమ్మిట్ కు వచ్చే అతిథిలకు రోబో ఆహ్వానం పలుకుతోంది. గ్లోబల్ సమ్మిట్ లో నోబెల్ విజేత కైలాస్ సత్యార్థి పాల్గొన్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరు కానున్నారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రెండు రోజుల పాటు జరగనున్న సదస్సుకు భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు.