calender_icon.png 8 November, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

08-11-2025 05:04:14 PM

సిద్దిపేట రూరల్: సిద్దిపేట రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ మెంబెర్ దరిపల్లి చంద్రం, జిల్లా ఉపాధ్యక్షుడు మంద పాండు, రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్రం అంజిరెడ్డి మాట్లాడుతూ “రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొని, కార్యకర్తలకు అండగా నిలబడి, పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయనదే” అని పేర్కొన్నారు. 

అలాగే రాబోయే రోజుల్లో సిద్దిపేట రూరల్ కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ అద్యక్షుడు నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ సదాశివ రెడ్డి, మల్లారెడ్డి, మహేందర్ రెడ్డి, రాజు సురేష్,రెడ్డి బాలయ్య మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.