08-11-2025 04:58:03 PM
రైతు బాంధవుడు విజయ రమణారావు
మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు
అంతటి అన్నయ్య గౌడ్ పుష్పలత ఆధ్వర్యంలో మహా అన్నదానం....
సుల్తానాబాద్ (విజయక్రాంతి): అపూర్వ సోదరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుల జన్మదిన వేడుకలు సుల్తానాబాద్ పట్టణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలు హాజరై విజయ రమణారావుకు మద్దతుగా చేసిన నినాదాలు హోరెత్తయి, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతటి అన్నయ్య గౌడ్, మాజీ సర్పంచ్ అంతటి పుష్పలత దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని జరిపారు.
ఈ కార్యక్రమాన్ని మాజీ సర్పంచ్ అంతటి పుష్పలత ప్రారంభించారు, సుమారు వేయిమందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి,ఎమ్మెల్యే విజయ రమణారావు ల పుట్టినరోజును పురస్కరించుకొని సీఎం, ఎమ్మెల్యే కు శుభాకాంక్షలు తెలుపుతూ పట్టణంలోని రాజీవ్ రహదారి వెంట, ప్రధాన రోడ్లపై, రహదారులను హోర్డింగులు, ఫ్లెక్సీలతో నింపి వేసి వారిపై అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మాజీ సర్పంచ్ అంతటి పుష్పలత మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే విజయ రమణారావు ల పుట్టినరోజు ఒకే రోజు కావడం వారి అభిమానులు అందరికీ ఎంతో ఆనందదాయకమని అన్నారు. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యానికి ఇది నిదర్శనమని చెప్పారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ రోజుకు 18 గంటలు ప్రజా సేవలో నిమగ్నమై ఉంటారని కొనియాడారు.
ఎమ్మెల్యే విజయరామరావు పెద్దపల్లి నియోజకవర్గానికి రైతు బాంధవుడిగా, పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెద్దన్నగా అండగా ఉంటున్నారని అన్నారు. ప్రజా నాయకుడిగా కాకుండా ప్రజా సేవకుడిగా రాష్ట్రంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. ఇలాంటి విజయ రమణారావు ఎమ్మెల్యేగా ఉండటం నియోజకవర్గ ప్రజల అదృష్టమని అన్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరి మహేందర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్య గౌడ్, ధనాయక్ దామోదరావు, పన్నాల రాములు, పడాల అజయ్ గౌడ్, జానీ, మాజీ సర్పంచ్ సత్యనారాయణ రావు, ముత్యాల రవీందర్, కందుకూరి ప్రకాష్ రావు( పెద్దన్న), అంతటి సాగర్, అంతటి లక్ష్మణ్, అంతటి అభినవ్ గౌడ్, పల్ల సురేష్ , డి. శ్రీనివాసరావు, అమీరిశెట్టి రాజలింగం, అమీరిశెట్టి తిరుపతి, మాజీ కౌన్సిలర్ లు దున్నపోతుల రాజయ్య, తోరికొండ ప్రభాకర్ , పొన్నం చంద్రయ్య గౌడ్ , నిషాద్ రఫీక్, చింతల సునీత, డి. మధు, విష్ణు, మోబిన్, ఫరూక్, బాబార్, వసీం, ఆసిఫ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అమీనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.