calender_icon.png 8 November, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దౌల్తాబాద్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా

08-11-2025 05:05:56 PM

దౌల్తాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మద్దెల స్వామి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండారు లాలు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా కృషి చేస్తున్న నిజమైన ప్రజానాయకుడు రేవంత్‌రెడ్డి అని ప్రశంసించారు. విద్య, వ్యవసాయం, యువత సంక్షేమం వంటి రంగాల్లో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రజల్లో నమ్మకం కలిగించాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.